VIDEO: ఓపెన్ జిమ్ సెంటర్‌కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
WGL: వర్ధన్నపేట పట్టణంలో ఏర్పాటు చేయనున్న ఓపెన్ జిమ్ సెంటర్‌కు బుధవారం ఎమ్మెల్యే నాగరాజు శంకుస్థాపన చేశారు. ప్రజల ఆరోగ్యాభివృద్ధే లక్ష్యంగా ఈ జిమ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. యువత, వృద్ధులు వ్యాయామం ద్వారా ఆరోగ్యంగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.