మహిళా పోలీసులకు ఆత్మరక్షణ శిక్షణ

NLG: జిల్లాలో SHE Leads - NALGONDA కార్యక్రమంలో భాగంగా మహిళా పోలీసు సిబ్బందికి వారం రోజుల పాటు ఆత్మరక్షణ శిక్షణ నిర్వహించారు. శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ హాజరై, ఈ శిక్షణ మహిళా సిబ్బందికి ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంపొందించడానికి దోహదపడుతుందని తెలిపారు. విధిలో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఈ శిక్షణ ఉపయుక్తమని చెప్పారు.