అంజన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు

JGL: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని శనివారం ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు ఉచిత దర్శనంలో ఇబ్బందులు లేకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. దూరప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా భక్తులు రావడంతో ఆలయంతో పాటు చుట్టుప్రక్కల రద్దీగా మారాయి. ముందుగా ధర్మగుండంలో స్నానాలు చేసి ఇతర మొక్కులు చెల్లించుకుని స్వామివారి సేవలో తరించారు.