'రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టాలి'
AKP: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టాలని ఎస్పీ తుహీన్ సిన్హా ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం నెలవారి నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే కఠినంగా వ్యవహరించాలన్నారు.