హోంగార్డ్‌కు ప్రశంసా పత్రం అందజేత
AKP: రాంబిల్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న హోంగార్డు భూషణ్‌కు ఎస్పీ తుహీన్ సిన్హా శనివారం ప్రశంసాపత్రం, నగదు బహుమతి అందజేశారు. హోంగార్డు రైజింగ్ డే సందర్భాన్ని పురస్కరించుకుని నేర పరిశోధనలో అత్యంత ప్రతిభ కనబరిచిన సందర్భంగా ఈ అవార్డు అందజేశారు. అవార్డు అందుకున్న హోంగార్డ్‌ను పోలీస్ అధికారులు పలువురు అభినందించారు.