VIDEO: పాలకొండ చెరువులో క్యాట్ ఫిష్ కలకలం

VIDEO: పాలకొండ చెరువులో క్యాట్ ఫిష్ కలకలం

మహబూబ్ నగర్ పాలకొండ చెరువులో క్యాట్ ఫిష్‌లు పెద్ద ఎత్తున కనిపించడం మత్స్యకారుల్లో ఆందోళన రేపుతోంది. గత కొన్నేళ్లుగా గుర్తు తెలియని కారణాలతో చేపలు చనిపోతుండటం సమస్యగా మారింది. నేడు వలకు భారీగా క్యాట్ ఫిష్‌లు చిక్కడంతో భయం పెరిగిందని మత్స్యకారులు తెలిపారు. చెరువులో ఇవి పెరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.