పూజారిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు ఖరారు

పూజారిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు ఖరారు

WGL: గ్రేటర్ వరంగల్ పరిధిలోని పోచమ్మ మైదానం ప్రాంతంలో 2018 అక్టోబర్ 26న దేవాలయ పూజారిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. సయ్యద్ హుస్సేన్ అనే వ్యక్తి సమీప ఆలయంలో చొరబడి పూజారిని కర్రతో ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు. ఈ క్రమంలో పూజారి తీవ్రంగా గాయపడి మృతి చెందారు. అయితే, నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు విధించారు.