VIDEO: వేటకు వెళ్లిన బోట్లన్నీ సురక్షితం
VSP: తుఫాను కారణంగా విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు చేరవలసిన 90 బోట్లు సురక్షితంగా ఉన్నాయని మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు మంగళవారం విశాఖలో మీడియా తెలియజేశారు. తుఫాను హెచ్చరికలకు ముందే చేపలు వేటకు వెళ్లిన 90 బోట్లు గోపాలపురం ఫిషింగ్ హార్బర్‌లో సురక్షితంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఎప్పటికప్పుడు మత్స్యకారులను అలెర్ట్ చేస్తున్నామన్నాడు.