పత్తి రైతులు ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు: మంత్రి

పత్తి రైతులు ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు: మంత్రి

KMM: పత్తి రైతులు ప్రతిపక్షాల ఉచ్చులో పడవద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. జిన్నింగ్ మిల్లుల డిమాండ్‌లను పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ చర్చలు సఫలం అయ్యాయని, రాష్ట్రంలో తక్షణమే 83 కొనుగోలు కేంద్రాలలో పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.