అక్రమంగా తరలిస్తున్న యూరియా పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న యూరియా పట్టివేత

నారాయణపేట మండలం జలాల్ పూర్ చెక్ పోస్టు వద్ద శుక్రవారం వాహనాలు తనిఖీలు చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న యూరియా బస్తాలను పట్టుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. రెండు జీపులు, ఒక ఆటోలో మొత్తం 34 బస్తాల యూరియాను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీటిని కర్ణాటకకు తీసుకెళ్తున్నారని అన్నారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.