ఈ నెల 27 నుంచి తట్టు నివారణ టీకాలు

ఈ నెల 27 నుంచి తట్టు నివారణ టీకాలు

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పొంగు, తట్టు నివారణకు ఈ నెల 27 నుంచి మూడు విడతలుగా పత్యేక డ్రైవ్ నిర్వహించి టీకాలు వేయనున్నట్లు వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ లక్ష్మీనర్సయ్య తెలిపారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో శనివారం సిబ్బందితో  సమావేశమయ్యారు. ఈ రెండు వైరస్‌లు ప్రమాదకరమని, వీటి వల్ల పిల్లల్లో న్యూమోనియా, డయేరియా, మెదడు ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుందన్నారు.