కార్యకర్తలతో సమావేశమైన ఎమ్మెల్యే

కార్యకర్తలతో సమావేశమైన ఎమ్మెల్యే

VZM: టీడీపీ అధిష్టానం ఆదేశాలతో విజయనగరం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అదితి గజపతి రాజు శుక్రవారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులంతా ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను నేరుగా తెలుసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు.