శాస్త్రవేత్తలు తిరిగిన ఎద్దుల బండి

శాస్త్రవేత్తలు తిరిగిన ఎద్దుల బండి

W.G: 1925 సంవత్సరంలో పెనుమంట్ర మండలం మార్టేరు కేంద్రంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఏర్పాటైంది. అప్పట్లో వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ఇక్కడి వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ ఎద్దుల బండినే ఉపయోగించేవారు. ప్రస్తుతం పరిశోధన సంస్థ ఏర్పాటై 100 సంవత్సరాలు కావొస్తున్న ఈ ఎద్దుల బండి చెక్కు చెదరకపోవడం విశేషం.