ఎక్కడపడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేయవద్దు

ప్రకాశం: ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలిపి ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగించవద్దని వాహనదారులకు సీఐ ఖాజావలి సూచించారు. సోమవారం కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండ్, కందుకూరు రోడ్డు సెంటర్ వద్ద వాహనదారులకు, షాపుల యజమానులకు సీఐ ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసులు సూచించిన విధంగా రహదారులకు ఓవైపు మాత్రమే వాహనాలు పార్కింగ్ చేయాలన్నారు.