'కప్పట్రాళ్లలో నూతన సబ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలి'
KRNL: దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామ రైతులు మంగళవారం విద్యుత్ శాఖ ఎస్‌ఈను కలిసి గ్రామంలో విద్యుత్ సమస్యలను వివరించారు. సాగు కోసం సరైన విద్యుత్ అందడం లేదని తెలిపారు. దీనిపై స్పందించిన ఎస్‌ఈ త్వరలోనే సబ్ స్టేషన్ ఏర్పాటుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కప్పట్రాళ్ల మల్లికార్జున, సందు పాలెం లాలప్ప, చాకలి లక్ష్మన్న, తదితరులు పాల్గొన్నారు.