మియాపూర్- విజయవాడ ట్రావెల్ బస్సుకు ప్రమాదం

మియాపూర్- విజయవాడ ట్రావెల్ బస్సుకు ప్రమాదం

HYD: మియాపూర్- విజయవాడకు బయలుదేరిన కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. పోలీసుల వివరాలిలా.. ఏపీలోని నందిగామ, అనాసాగరంలో మంగళవారం తెల్లవారుజామున బస్సు లారీని క్రాస్ చేసే క్రమంలో మరో లారీని ఢీకొట్టడంతో బస్సు ఎడమ భాగం ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బస్సులో 20 మంది ఉన్నట్లు సమాచారం.