అయోడిన్‌పై అవగాహన సదస్సు

అయోడిన్‌పై అవగాహన సదస్సు

ప్రకాశం: మార్కాపురం పట్టణం పూల సుబ్బయ్య కాలనీలో సీ.ఎస్.ఆర్ ఆధ్వర్యంలో అయోడిన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మురికివాడల ప్రజలకు అయోడిన్ ప్రయోజనాలు, లోపం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను వివరించారు. ఇంట్లోనే ఉప్పులో అయోడిన్ ఉందో లేదో పరీక్షించే విధానాన్ని ప్రదర్శించారు. గర్భిణీలు, పిల్లలకు అయోడిన్ ఎంతో అవసరమని తెలిపారు.