'P4 సర్వే పక్కాగా నిర్వహించాలి'

SKLM: పలాస, కాశీబుగ్గ పురపాలక సంఘంలో ప్రస్తుతం చేపట్టిన P4 సర్వే ప్రగతిపై అన్ని సచివాలయాల అడ్మిన్ కార్యదర్శులతో గురువారం పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ నడిపేన రామారావు సమీక్ష నిర్వహించారు. P4 సర్వేను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సర్వేపై అలసత్వం వహిస్తే చర్యలు తీసుకునేందుకు వెనుకాడమని కమిషనర్ హెచ్చరించారు.