అన్నదాన సత్రానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం
ప్రకాశం: రాచర్ల మండలం నెమలిగుండ్ల శ్రీ రంగనాయకస్వామి దేవస్థానం వద్ద నిర్వహిస్తున్న ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్ర కార్యక్రమానికి ఎమ్మెల్యే అశోక్ రెడ్డిని సత్ర అధ్యక్షులు మల్లిఖార్జున మంగళవారం మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయాలని కోరారు. భక్తులకు నిత్య అన్నదానం నిర్వహించడం గొప్ప సేవ అని ఎమ్మెల్యే అభినందించారు.