నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి
NRPT: మరికల్ మండల కేంద్రంలోని నామినేషన్ కేంద్రాన్ని సోమవారం నారాయణపేట జిల్లా ఎన్నికల అధికారి మొగులప్ప పరిశీలించారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి స్వీకరించాలని ఆయన సూచించారు. నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థితో పాటు మరో ఇద్దరు మాత్రమే ఉండాలని అధికారులకు ఆదేశించారు.