'ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు న్యాయం చేయాలి'

NRPT: పోలీస్‌స్టేషన్‌లల్లో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం నారాయణపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులలో బాధితులకు నష్ట పరిహారం వెంటనే అందించాలని చెప్పారు.