VIDEO: 'హామీలను ప్రభుత్వం అమలు చేయాలి'
VSP: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని సీపీఐ డిమాండ్ చేసింది. జీవీఎంసీ 7వ వార్డు మల్లయ్యపాలెం సచివాలయం వద్ద లబ్ధిదారులతో కలిసి గురువారం ఆందోళన నిర్వహించారు. పట్టణ పేదలకు 2 సెంట్ల స్థలం, ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల సాయం ఇవ్వాలని, అలాగే, టిడ్కో ఇళ్లు వెంటనే అందించాలని కోరారు.