'పోలీసు లాఠీచార్జీ అసత్యం'

MHBD: నర్సింహులపేట మండలంలోని భారతి ఫెర్టిలైజర్ వద్ద యూరియా కూపన్ల కోసం రైతులు ఒక్కసారిగా పోటెత్తారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరగకుండా పోలీసులు వెంటనే స్పందించి గుంపును అదుపు చేశారు. రైతులను క్యూ పద్ధతిలో పంపించి అందుబాటులో ఉన్న కూపన్లను పంపిణీ చేశారు. పోలీసులు ఎవరిపైన లాఠీఛార్జ్ చేయలేదని, కేవలం పరిస్థితిని ఆదుపు చేయడానికి ప్రయత్నించరని రైతులు తెలిపారు.