‘భారత్-అమెరికా బంధం అత్యంత పటిష్టం’

‘భారత్-అమెరికా బంధం అత్యంత పటిష్టం’

భారత్, అమెరికా మధ్య సంబంధాలు అత్యంత బలంగా ఉన్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఇది కేవలం సాధారణ సహకారం కాదని, దీర్ఘకాలిక ఒప్పందాలతో కూడిన సంస్థాగత బంధమన్నారు. ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య సమన్వయం, కార్యాచరణ సహకారం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. దౌత్యపరమైన చర్చలు, ఒప్పందాల అమలులో ఇరు దేశాలు కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాయని వెల్లడించారు.