అండమాన్‌లో త్వరలో సీప్లేన్ సందడి
ముంబైకి చెందిన 'మెహైర్' సంస్థ అండమాన్ నికోబార్ దీవుల్లో త్వరలో సీప్లేన్ సర్వీసులను ప్రారంభించనుంది. శ్రీ విజయపురం (పోర్ట్ బ్లెయిర్) కేంద్రంగా స్వరాజ్ ద్వీప్, షహీద్ ద్వీప్, లాంగ్ ఐలాండ్ వంటి 5 కీలక ప్రాంతాలకు ఈ విమానాలు నడవనున్నాయి. ఇప్పటికే వాటర్ సెగ్మెంట్ పనులు పూర్తయ్యాయి. ఈ సేవలతో దీవుల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా పర్యాటక రంగం మరో మెట్టు ఎక్కనుంది.