పాకల బీచ్‌కు ప్రత్యేక బస్సులు
ప్రకాశం: కనిగిరి ఆర్టీసీ డిపో నుంచి ప్రతి ఆదివారం పాకల బీచ్‌కు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడపనున్నట్లు డిపో మేనేజర్ సయానా బేగం తెలిపారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రతి ఆదివారం ఉదయం 7:15, 8:15 గంటలకు బస్సులు బయలుదేరుతాయన్నారు. రూ.80లు టికెట్ ధర కాగా.. మహిళలకు శ్రీశక్తి పథకం అమలులో ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని పర్యాటకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.