రైతుల పాడి పశువుల కోసం మినీ గోకులం షెడ్లు: శంకర్

రైతుల పాడి పశువుల కోసం మినీ గోకులం షెడ్లు: శంకర్

GNTR: ఫిరంగిపురం మండలం శిరంగి పాలెం గ్రామంలో శుక్రవారం మినీ గోకులం షెడ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శంకర్ పాల్గొన్నారు. అనంతరం 113 తాళ్లూరు గ్రామంలో నిర్మించిన గోకులం షెడ్డులను పరిశీలించారు. దీనితో పాటుగా ఫిరంగిపురం గ్రామంలోని మంచినీటి చెరువు పరిస్థితులను పరిశీలించి, సమస్యలపై సూచనలు చేశారు.