నైని కోల్ బ్లాక్‌ను పరిశీలించిన డైరెక్టర్ & సీవీవో

BDK: సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సీవీవో బి. వెంకన్న ఒడిశా రాష్ట్రం అంగుల్ జిల్లాలోని నైనీ కోల్ బ్లాక్‌ను బుధవారం పరిశీలించారు. ఓపెన్కాస్ట్ గనుల ఉత్పత్తి, స్టాక్యార్డ్ మరియు డిస్పాచ్ కార్యకలాపాలను సమీక్షించారు. ఈ పర్యటనలో సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణ, నైనీ ఏరియా జీఎం కూడా పాల్గొన్నారు. అనంతరం సరఫరా చర్యలపై చర్చించారు.