లుకలాం జడ్పీ పాఠశాలను సందర్శించిన MEO
SKLM: నరసన్నపేట మండలం లుకలాం జడ్పీ పాఠశాలను ఎంఈఓ పేడాడ దాలినాయుడు సందర్శించారు. బుధవారం ప్రార్థన సమయానికే ఆయన పాఠశాలకు చేరుకున్నారు. ప్రార్థన సమయంలో చేపడుతున్న పలు అంశాలను ఆయన పరిశీలించారు. ఈరోజు వార్తా విశేషాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేయడం ఆనందదాయకమన్నారు. అలాగే యోగ, సూర్య నమస్కార కార్యక్రమాలు కూడా చేపట్టాలన్నారు.