సెప్టెంబర్ 9 నుంచి డిగ్రీ వన్ టైం ఛాన్స్ పరీక్షలు

MDK: వచ్చే నెల 9 నుంచి డిగ్రీ వన్ టైం ఛాన్స్ పరీక్షలు ప్రారంభంకానున్నట్లు అధికారులు తెలిపారు. 2000 సంవత్సరం నుంచి 2015 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలో వివిధ డిగ్రీ కోర్సుల్లో చదివి ఫెయిల్ అయిన విద్యార్థులు వన్ టైం ఛాన్స్ పరీక్షకు అర్హులన్నారు. ఓయూ క్యాంపస్ ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లో వన్ టైం ఛాన్స్ పరీక్షకు ఫీజులు చెల్లించవచ్చని కంట్రోలర్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు.