బోయాపూర్ శివారులో మొసలి సంచారం

బోయాపూర్ శివారులో మొసలి సంచారం

NGKL: బిజినేపల్లి మండలం బోయాపూర్ గ్రామ శివారులో మొసలి సంచారం కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన దేవేందర్ మంగళవారం అర్ధరాత్రి తన పంట పొలానికి వెళుతుండగా కేఎల్ఐ కాల్వ కట్టపై రోడ్డు దాటుతున్న భారీ మొసలిని గమనించాడు. వెంటనే దానిని వీడియో తీసి SMలో పోస్ట్ చేయగా, అవి వైరల్ అవుతున్నాయి. ఇదే ప్రాంతంలో ఇటీవల శాయిన్‌పల్లిలో మొసలి దర్శనమివ్వడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు.