కన్న కూతుర్లపై అత్యాచారం.. 20 ఏళ్లు జైలు శిక్ష

కన్న కూతుర్లపై అత్యాచారం.. 20 ఏళ్లు జైలు శిక్ష

VSP: కన్న తండ్రె కూతుర్ల పాలిట కాలయముడయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఆరిలోవలో ఉంటోన్న ఓవ్యక్తి తన ఇద్దరు కూతుర్ల (మైనర్ల)పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికలను బెదిరించేవాడు.ఈ అఘాయిత్యం తెలుసుకున్న తల్లి గత ఏడాది ఆరిలోవలో ఫిర్యాదు చేసింది. నేరం రుజువు కావడంతో పోక్సో కోర్టు అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.