VIDEO: 'సింగరాయకొండ నుంచి ఒంగోలుకి బస్సులు పెంచాలి'

VIDEO: 'సింగరాయకొండ నుంచి ఒంగోలుకి బస్సులు పెంచాలి'

ప్రకాశం: సింగరాయకొండ నుంచి ఒంగోలుకు వెళ్లే ప్రయాణికులకు బస్సు కష్టాలు తప్పడం లేదు. సరైన సమయానికి బస్సు సర్వీసులు లేకపోవడంతో నిత్యం వందలాది మంది ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు బస్టాండ్ వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ప్రధానంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ, అందుకు తగ్గట్టుగా బస్సులు నడపడం లేదని స్థానికులు వాపోతున్నారు.