మహిళల రక్షణ గాలికొదిలేశారు: వరుదు కళ్యాణి
AP: నంద్యాలలో వైసీపీ మహిళా విభాగం సమావేశమయ్యింది. ఈ కార్యక్రమానికి మహిళా అధ్యక్షురాలు, MLC వరుదు కళ్యాణి హాజరయ్యారు. రాష్ట్రంలో క్రైమ్‌రేట్ పెరిగిందని అభిప్రాయపడ్డారు. మాజీ సీఎం జగన్‌ను తిట్టడమే హోం మంత్రి అనిత పని అని ఎద్దేవా చేశారు. విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ దొరుకుతున్నాయని ఆరోపించారు. మహిళల రక్షణ గాలికొదిలేశారని మండిపడ్డారు.