కువైట్‌లో పోరుమామిళ్ల వాసి మృతి

కువైట్‌లో పోరుమామిళ్ల వాసి మృతి

KDP: పోరుమామిళ్ల మండలం పెద్ద ఎర్రసాలకి చెందిన సూరే సుబ్బయ్య ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లాడు. గత కొన్ని సంవత్సరాలుగా అక్కడే జీవనం సాగిస్తున్న అతడు, శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.