బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ
AP: కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఐదవ తరగతి చదువుతున్న బాలిక రంజిత హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఎలక్ట్రీషియన్ శ్రీనివాసరావు బాలికను హతమార్చినట్లు నిర్థారించారు. దొంగతనం కోసం చిన్నారి ఇంటికి వెళ్లిన ఎలక్ట్రీషియన్.. దొంగతనం విషయాన్ని తల్లికి చెబుతుందనే భయంతోనే.. రంజితను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశాడు. ఈ కేసులో ఇతరుల ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.