ఉగాది వేడుకల బ్రోచర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

WG: మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు పండగలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఈనెల 30న భీమవరం భీమేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో జరిగే ఉగాది పురస్కార వేడుకల బ్రోచర్‌ను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. 40 ఏళ్లుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.