నేడు జిల్లాలో మంత్రి పర్యటన

NGKL: వెల్దండ మండలంలో 12న అనగా నేడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించనున్నారు. వెల్దండ నుంచి రాయచూర్ వరకు చేపట్టబోయే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఆమె భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేస్తారు. అనంతరం నియోజకవర్గంలో జరిగే వివిధ కార్యక్రమాలలో మంత్రి పాల్గొంటారు.