జిల్లాలో 'మీ మొబైల్ - మీ ఇంటికి' కార్యక్రమం

జిల్లాలో 'మీ మొబైల్ - మీ ఇంటికి' కార్యక్రమం

అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ ఆధ్వర్యంలో మరో వినూత్న కార్యక్రమం మొదలవుతోంది. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి, నేరుగా యజమానుల ఇంటి వద్దకే వెళ్లి అందించేందుకు 'మీ మొబైల్ – మీ ఇంటికి' అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సేవలతో ప్రజలు పోలీస్ స్టేషన్‌ను పదేపదే రావాల్సిన అవసరం తప్పుతుంది. నేడు ఈ కార్యక్రమాన్ని ప్రారంబించబోతున్నారు.