పద్మశాలి భవన్ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యేకు వినతి
JGL: మల్యాల మండలంలో పద్మశాలి భవన్ నిర్మాణం చేపట్టాలని కోరుతూ సంఘం సభ్యులు బుధవారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు వినతిపత్రం సమర్పించారు. భవన్ నిర్మాణానికి అవసరమైన సహకారం అందించాలని వారు కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముల్క మల్లయ్య, శ్రీనివాస్, ప్రతాప్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.