నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి సహకరించండి

BDK:జిల్లాలోని చండ్రుగొండ మండల కేంద్రాల్లో నూతన గ్రంథాలయ భవనాల నిర్మాణం కొరకు సహకరించాలని కోరుతూ జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ వీరబాబు ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు వినతి పత్రం అందజేశారు. ప్రస్తుత రోజుల్లో గ్రంథాలయాలకు మరింత ఆదరణ పెరిగిందని, పోటీ పరీక్షలకు సిద్ధపడే యువత పెద్ద ఎత్తున గ్రంథాలయాలపై ఆధారపడి చదువుతున్నారని తెలిపారు.