చింతాలమ్మా సిరి జాతర కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్
E.G: రాజానగరం నియోజకవర్గం బీజేపీ కన్వీనర్, సీనియర్ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామ దేవత చింతాలమ్మా సిరి జాతర కార్యక్రమంలో పాల్గొన్నారు. బుధవారం బీజేపీ నాయకులతో కలిసి గ్రామ దేవత చింతాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి కృప, కటాక్షము నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.