ఆటో బోల్తా.. వ్యక్తికి తీవ్ర గాయాలు
ASR: అడ్డతీగల మండలం గొంటివాణిపాలెం సమీపంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో సరంపేటపాడుకు చెందిన బండారు శ్రీను తీవ్రంగా గాయపడ్డాడు. ఏలేశ్వరం నుంచి సరంపేటపాడు వెళుతున్న ఆటో ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయి బోల్తా కొట్టిందని స్థానికులు తెలిపారు. శ్రీను కాళ్ళు, చేతులపై తీవ్రంగా గాయాలు అవ్వడంతో 108 సిబ్బంది నవాజ్, లక్ష్మి అత్యవసర చికిత్స అందజేశారు.