'ఆలయాల నిధులను బ్యాంకుల రక్షణకు వాడొద్దు'
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆలయాలకు చెందిన డబ్బును ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన సహకార బ్యాంకుల మనుగడ కోసం వాడొద్దని తెలిపింది. ఆ సొమ్మును పూర్తిగా ఆలయాల అభివృద్ధికే వాడాలని సూచించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.