కొల్లిపరలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం
GNTR: పొలంలో వరి చెత్తను కాల్చడం వలన కలిగే నష్టాలపై కొల్లిపర మండలం అన్నవరంలో నిర్వహించిన 'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో ఏవో శ్రీనివాసరెడ్డి రైతులకు అవగాహన కల్పించారు. దీనివల్ల వచ్చే పొగ, ధూళితో మనుషుల ఆరోగ్యం దెబ్బతింటుందని, నేల సహజ తత్వాన్ని కోల్పోతుందని తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరిగి, మొక్కలకు ఉపయోగపడే బ్యాక్టీరియా నశించిపోతుందని ఆయన వివరించారు.