ప్రభుత్వ పథకాలపై తుర్లపాడు ఎంఈవో అవగాహన
ప్రకాశం: తర్లుపాడు మండలం లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాలలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ఎంఈవో సుజాత ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, లైబ్రరీ బుక్స్, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థిమిత్ర కిట్స్, FLN కిట్స్, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్, తల్లికి వందనం, లాంటి ప్రభుత్వం కల్పించే అన్ని సౌకర్యాలను పేరెంట్స్‌కు వివరించారు.