కట్టలేరుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని వినతి

NTR: గంపలగూడెంలో శుక్రవారం జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు వినగడప కట్టలేరుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ కార్యదర్శి మద్దిరెడ్డి వెంకటరెడ్డి, మండల కమిటీ సభ్యులు మీసాల గోపి, మల్లవరపు కుటుంబరావు, మీసాల గోపాలరావు, పాల్గొన్నారు.