మాజీ రాష్ట్రపతికి నివాళి అర్పించిన సీఎం, ఎంపీలు
MHBD: భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎంపీ వేం నరేందర్ రెడ్డి పుష్పాంజలి ఘటించి, నివాళి అర్పించారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఎంపి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ చేసిన సేవలను వారు కొనియాడారు. మంత్రి ఉత్తంకుమార్, ఎంపీ చామల కిరణ్ కుమార్, అనీల్ యాదవ్ తదితరులున్నారు.