రూ.26వేలు వేతనం చెల్లించాలి

ASR: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జే.భగత్ రాం కోరారు. బుధవారం అరకులో సీఐటీయూ అరకు మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు రూ.26వేలు వేతనం చెల్లించాలని కోరారు.