అక్రమంగా తరలిస్తున్న మట్టి.. పట్టించుకోని అధికారులు

NRPT: మిడ్జిల్ మండల పరిధిలోని కాలువ నుంచి కొందరు అక్రమంగా మట్టిని టిప్పర్లతో నూతనంగా నిర్మిస్తోన్న కొత్తూరు రోడ్డుకు తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కెనాల్ పక్కన డంప్ చేసిన మట్టిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.